పుంగనూరు: చిత్తూరు: ఎర్రచందనం వాహనాన్ని వెంబడిస్తుండగా ఫారెస్ట్ అధికారికి గాయాలు
చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం పులిచెర్ల రహదారిపై ఎర్రచందనం స్మగ్లర్ల వాహనాన్ని వెంబడిస్తుండగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రకాష్ కుమార్కు గాయాలయ్యాయి. ప్రమాదవశాత్తు ఆయనకు కాళ్లకు ఫ్రాక్చర్ అయ్యింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.