మోత్కూర్: మోత్కూర్లో వెలుగులోకి బృహత్ శిలాయుగం నాటి సమాధులు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లో బృహత్ శిలాయుగం నాటి సమాధులను పురావస్తు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి బృందం గుర్తించింది. రాకాసి బోళ్ల ప్రాంతంలో రాతి పనిముట్లు, శిస్తు సమాధుల ఆనవాళ్లు బయటపడ్డాయి. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరగడం వల్ల కొన్ని సమాధులు ధ్వంసమయ్యాయని పరిశోధకులు తెలిపారు.