నర్సీపట్నం: నర్సీపట్నం చేరుకున్న 22 అడుగుల భారీ గణనాథుడు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అబిడ్స్ సెంటర్లో 22 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. శ్రీ నూకాంబిక యూత్ ఆధ్వర్యంలో 15 రోజుల పాటు పూజలు నిర్వహించి, ఆ తర్వాత నిమజ్జనం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.