పుంగనూరు: పుంగనూరు సంత గేటు వద్ద ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని SDPI డిమాండ్
పుంగనూరు సంత గేటు పరిసరాల్లోని 6 వార్డుల ప్రజల కోసం ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని SDPI కోరింది. 7-8 వేల మందికి వైద్య సేవలు అందేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమం చేస్తామని SDPI జిల్లా అధ్యక్షులు యూసుఫ్ తెలిపారు.