అదిలాబాద్ అర్బన్: డిసెంబర్ 1, 2, 3న ఛలో పార్లమెంట్: సీఐటీయూ పిలుపు
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం కల్పించాలని కోరుతూ డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించే ఛలో పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్లో జరిగిన సెమినార్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.