కొండపి: టంగుటూరు మండలంలోని 16 నెంబర్ జాతీయ రహదారిపై వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించిన పోలీసులు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని 16 నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద మంగళవారం స్థానిక సీఐ హజరతయ్యా వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడుపుతామని వాహనదారులతో సీఐ ప్రతిజ్ఞ చేయించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ఇద్దరు హెల్మెట్ ధరించాలని సిఐ వాహనదారులకు తెలిపారు. కారు నడిపే డ్రైవర్ తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.