చేర్యాల: కడవెరుగులో ఘనంగా హరే రామ హరే కృష్ణ నగర సంకీర్తన
చేర్యాల మండలం కడవెరుగు గ్రామంలో హరే రామ హరే కృష్ణ నగర సంకీర్తన భక్తిశ్రద్ధలతో జరిగింది. కులమతాలకు అతీతంగా గ్రామస్థులు పాల్గొని, భజనలు, కీర్తనలతో గ్రామాన్ని ఆధ్యాత్మికం చేశారు. ఈ కార్యక్రమం సామాజిక ఐక్యతను, సనాతన ధర్మ సంప్రదాయాలను పెంపొందించేలా సాగింది.