జనగాం: చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలు: ఘనంగా నివాళులర్పించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఐలమ్మ మనుమరాలు చిట్యాల శ్వేత ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. సాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ పాత్రను కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.