బనగానపల్లె: రవ్వలకొండలోని ఏపీ మోడల్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం రవ్వలకొండలోని ఏపీ మోడల్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించి, విజేతలకు ప్రిన్సిపల్ సీహెచ్. రామలక్ష్మి, SMC ఛైర్మన్ అక్తర్ అలీ బేగ్, వైస్ ఛైర్మన్ షాహిన్ బహుమతులు అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ప్రిన్సిపల్ ఆకాంక్షించారు.