వికారాబాద్: ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి సిరిపురం గ్రామంలో చీమల దారి మాది సర్పంచ్ నరసింహ రెడ్డి
మహా శివుని కృపతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని చీమలదరి మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సిరిపురం గ్రామ సమీపంలో మహానంది ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. విగ్రహ దాతగా నరసింహారెడ్డి పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక దైవ చింతన అలవర్చుకొని సన్మార్గంలో నడుచుకుంటే మంచి జీవితం సాధ్యపడుతుందన్నారు.