వికారాబాద్: తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్కతల మాజీ సర్పంచ్ వడ్డె రాములు.
చేవెళ్ల నియోజకవర్గం,నవాబుపేట మండల అభివృద్ధికి నా పూర్తి సహకారం ఉంటుందని చేవెళ్ల కాంగ్రెస్ నాయకులు భీమ్ భరత్, నవాబుపేట మండల నాయకులకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హామీ ఇచ్చారు. భీమ్ భరత్ ఆధ్వర్యంలో నవాబుపేట మండలం అర్హతల గ్రామం మాజీ సర్పంచ్ వడ్డే రాములు,ఇతర నాయకులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.