వికారాబాద్: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మానసిక ఆందోళనలకు గురికావద్దు- ఇంటర్ నోడల్ అధికారి శంకర్ నాయక్
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మానసిక ఆందోళనలకు గురి కావద్దని,ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించెందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి ఎన్ శంకర్ నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో ఏవైనా అనుకోని సంఘటనలు జరిగితే ఇంటర్ నోడల్ అధికారి కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని తెలిపారు.