వికారాబాద్: సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసిన దారుర్ ఎస్‌ఐ వేణుగోపాల్ గౌడ్
పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి దారుర్ ఎస్‌ఐ వేణుగోపాల్ గౌడ్ బాధితులకు అప్పగించారు. గత ఆరు నెలల క్రితం దారుర్ మండల కేంద్రానికి చెందిన చాకలి నరసింహులు, ఈ నెల 12వ తేదీన అదే గ్రామానికి చెందిన కుమ్మరి బిచ్చయ్య సెల్‌ఫోన్లు మార్కెట్‌లో చోరికి గురైనట్లు ఫిర్యాదు చేశారు. దీంతో సీఈఐఆర్ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను గుర్తించి శుక్రవారం బాధితులకు ఎస్‌ఐ వేణుగోపాల్ గౌడ్ అందజేశారు.