వికారాబాద్: జిల్లాలో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులను పెండింగ్ ఉంచకుండా మార్చి 15 లోపు పూర్తి చేయాలి: కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్ జిల్లాలో మంజూరైన సీసీ రోడ్లకు సంబంధించి నిర్మాణ పనులను పెండింగ్ ఉంచకుండా మార్చి 15 లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సీసీ రోడ్ల గురించి వివరించారు. జిల్లాలో సీసీ రోడ్లను టార్గెట్‌గా పెట్టుకుని లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు.