విశాఖపట్నం: విశాఖపట్నం కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా తులసీ దళార్చన
విశాఖపట్నం బురిజిపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శనివారం తులసీ దళార్చన పూజలు ఘనంగా జరిగాయి. అర్చకులు అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.