అశ్వారావుపేట: నల్లముడి పాండవుల గుట్ట అభివృద్ధికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రణాళిక
ములకలపల్లి మండలం నల్లముడి గ్రామంలోని పాండవుల గుట్టను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పరిశీలించారు. ఈ ప్రాంతాన్ని చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది, పురాతన ఆలయాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.