మార్కాపురం: పొదిలి నగర పంచాయతీ అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని తెలిపిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
పొదిలి నగర పంచాయతీ పరిధిలోని పలు వార్డులలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కనీసం ఒక రోడ్డు వేసిన పాపాన పోలేదని దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. 20 కోట్ల రూపాయల నిధులతో ప్రతి వార్డులో సీసీ రోడ్లు వేసి ప్రజా రవాణాను మెరుగుపరుస్తామన్నారు. అభివృద్ధి ఒక కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.