మేడ్చల్: రాంకీ డంపింగ్ యార్డు విషవాయువుల ధాటికి మరొకరి మృతి
జవహర్ నగర్ రాంకీ డంపింగ్ యార్డు కాలుష్యంతో బుర్రి ప్రసాద్ గౌడ్ మృతి చెందారు. ఈ ఘటనపై ఏనుగు సుదర్శన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. డంపింగ్ యార్డు సమస్యపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.