ధర్మపురి: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ
కార్తీకమాసం శనివారం సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు మరియు మంచినీటి సౌకర్యాలను కల్పించారు.