పూతలపట్టు: తవణంపల్లెలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు
తవణంపల్లె మండలంలోని షికారి కాలనీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఓవర్టేక్ చేసే క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.