నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, మర్రిపాడు మండలం,బూదవాడ వద్ద జాతీయ రహదారిపై ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందడు. మృతిచెందిన వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిస్తే మర్రిపాడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ శ్రీనివాసరావు కోరారు.