చేర్యాల: నవంబర్ 15న నల్లగొండలో రైతు మహాసభలు: భారీగా తరలిరావాలని పిలుపు
నల్లగొండలో నిర్వహించనున్న 36వ అఖిలభారత రైతు మహాసభల కోసం కొమురవెల్లిలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. రైతు వ్యతిరేక బిల్లుల ఉపసంహరణ, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ, నవంబర్ 15న జరిగే బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు.