శ్రీకాకుళం: ఎచ్చెర్ల IMFL డిపోలో ఎక్సైజ్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
ఎచ్చెర్ల మండలం షేర్ మహమ్మద్ పురంలోని ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ IMFL డిపోను ఎక్సైజ్ కమిషనర్ చమకూరి శ్రీధర్ తనిఖీ చేశారు. డిపో రికార్డులు, స్టాక్ నిర్వహణను పరిశీలించి, మద్యం దుకాణాలకు సకాలంలో సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.