వికారాబాద్: కోటపల్లి చౌరస్తా వద్ద అక్రమంగా తరలిస్తున్న కలప లారీ పెట్టేవేత
ధారూరు మండల సమీపంలోని కోట్పల్లి చౌరస్తా వద్ద పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానంతో లారీని తనిఖీ చేశారు. లారీ అనుమతి పత్రాలు లేకపోగా కలపను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి.. లారీని సీజ్ చేసి PSకు తరలించారు. లారీ డ్రైవర్ అల్లాబక్షపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వేణుగోపాల్ ఆదివారం తెలిపారు.. అక్రమంగా కలప రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు