మహబూబాబాద్: ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మురళి నాయక్
మహబూబాబాద్ జిల్లా లక్ష్మీపురం గమ్య తండాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మించిన నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ పాల్గొన్నారు. పేదల సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.