ఒంగోలు అర్బన్: స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో వికసిత భారత్, స్వర్ణాంధ్ర - 2047 సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | Aug 15, 2026
స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో వికసిత భారత్, స్వర్ణాంధ్ర - 2047 లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. శనివారం ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన 80 వ స్వాతంత్ర్యదిన వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్.పి.హర్షవర్ధన్ రాజుతో కలిసి ప్రత్యేక వాహనంలో ప్రయాణించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. రాష్ట్రాన్ని 2047 నాటికి సుమారు రూ.200 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ