నెల్లూరు గణేష్ ఘాట్ లో వైభవంగా కార్తీక దీపోత్సవం
సింహపురి సేవా సమితి ఆధ్వర్యంలో, స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రోత్సహంతో నెల్లూరు లో వేలాది మందితో కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్బంగా నెల్లూరు ఇరుకళల పరమేశ్వరీ ఆలయం వద్ద నెల్లూరు చెరువులో వైభవంగా తెప్పోత్సవం నిర్వహించారు. బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, దీపా వెంకట్, గిరిధర్ రెడ్డి, సినీ రచయిత అనంత శ్రీరామ్ పాల్గొన్నారు. శివనామ స్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది.