డోన్: సిమెంట్ నగర్ గ్రామంలో సొంత ఖర్చులతో రహదారి మరమ్మత్తుల పనులు
Dhone, Nandyal | Nov 13, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం సిమెంట్ నగర్ గ్రామంలో హైస్కూల్ రహదారి అధ్వానంగా మారడంతో ఆటోలు, విద్యార్థులు, గ్రామ ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి పరిస్థితిని గమనించిన గ్రామస్థులు హనీఫ్, రామాంజనేయులు, ఆంజనేయులు, శ్రీనివాసులు తమ మిత్రులు వన్నూర్ సాహెబ్, అబ్దుల్లా దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.స్పందించిన వన్నూర్ సాహెబ్, అబ్దుల్లా రెండు ట్రాక్టర్ల మట్టిని తెప్పించి సమస్యను పరిష్కరించారు.