దేవరకొండ: దేవరకొండ అయ్యప్ప ఆలయానికి 12 లక్షల విరాళం: దాతలను అభినందించిన ఎమ్మెల్యే బాలు నాయక్
దేవరకొండ అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగిన మాలధారణ ప్రారంభ మహోత్సవంలో ఎమ్మెల్యే బాలు నాయక్, చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణకు రూ. 12,12,111 విలువైన సామగ్రిని బహుకరించిన దాత గార్లపాటి ఎల్లయ్య, అరుణకుమారి దంపతులను ఎమ్మెల్యే అభినందించారు.