భద్రాచలం: భార్యను చంపి గోదావరిలో పడేసిన ఏఆర్ కానిస్టేబుల్: భద్రాచలంలో గాలింపు!
భద్రాద్రి కొత్తగూడెంలో ఏఆర్ కానిస్టేబుల్ నరేందర్ భార్య భవానిని హత్య చేసి గోదావరిలో పడేశాడు. బంధువుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, గజ ఈతగాళ్లతో భద్రాచలం వద్ద గాలింపు చర్యలు చేపడుతున్నారు. నిందితుడు నేరం అంగీకరించిన నేపథ్యంలో మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది.