పార్వతీపురం: విశాఖపట్నం-పార్వతీపురం మెమో ట్రైన్ ను రాయగడ వరకు పొడిగించాలి: సిపిఎం
విశాఖపట్నం నుండి విజయనగరం మీదుగా పార్వతీపురం వరకు నడుస్తున్న మెమో ట్రైన్ ను రాయగడ వరకు పొడిగించి, ప్రతిరోజూ నడపాలని సిపిఎం కొమరాడ మండల కమిటీ రైల్వే అధికారులను కోరింది. పండగలకు మాత్రమే పరిమితం కాకుండా నిత్యం నడపడం వల్ల ప్రయాణికులకు మేలు జరుగుతుందని నాయకులు పేర్కొన్నారు.