జడ్చర్ల: మన్ననూర్ వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కేఎల్ఐ కాలువ
జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలం మన్ననూరు శివారులలో కేఎల్ ఐ కాలువ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. కాలువ కట్ట తెగి పంట నష్టం జరుగుతుందేమోనని రైతులు శనివారం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాలువ తెగి భారీగా పంట నష్టపోయిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ, ప్రమాదం జరగక ముందే కాలువ కట్టలకు మరమ్మతులు చేపట్టాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.