గుంతకల్లు: గుత్తి శివారులో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఆచూకీ లభ్యం, గుత్తికి చెందిన రైల్వే ఉద్యోగి రమేష్ గా గుర్తింపు
అనంతపురం జిల్లా గుత్తి మండలం తురకపల్లి గ్రామ శివారులో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి గుత్తి పట్టణానికి చెందిన రైల్వే ఉద్యోగి గద్దల రమేష్ గా పోలీసులు గుర్తించారు. గుత్తి జీఆర్పీ పోలీసులు గురువారం తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి పట్టణ శివార్లలో గుత్తి-అనంతపురం రైలు మార్గంలో తురకపల్లి గ్రామ శివారులో నాందేడ్ నుంచి బెంగళూరుకు వెళ్ళే ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు లోకో పైలట్ సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుత్తి ఆసుపత్రికి తరలించారు. చేతి పైన ఉన్న పచ్చబొట్టు ఆధారంగా కుటుంబసభ్యులు మృతుడిని గుర్తించారు.