గద్వాల్: అయిజ సమీపంలో బోల్తా పడిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. అయిజ నుంచి ఎమ్మిగనూరుకు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.