అమలాపురం: అమలాపురంలో బియ్యం షాపులపై విజిలెన్స్ దాడులు: జరిమానాలు విధింపు
అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్ణీత ధరల కన్నా ఎక్కువకు బియ్యం అమ్ముతున్న షాపులపై విజిలెన్స్, లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన రెండు దుకాణాలకు రూ.20 వేల చొప్పున జరిమానా విధించారు. నిత్యావసర వస్తువులను అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.