అన్నమయ్య జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 230హెక్టార్లలో వరి పంట నష్టం వాటిల్లిందని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె.మంజుల బుధవారం సాయంత్రం తెలిపారు.వెన్నుదశ నుండి కోత దశలో ఉన్న పంట నీటి కోతకు గురై,నీరు నిలబడిందో, ఆ పొలాల్లోని వరి కర్రలు నేలకు వాలిపోవడంతో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు.వేరుశనగ కూడా కోతకు దగ్గరగా ఉండటం వలన నీరు నిలిచి పొలాల్లో ఆకుమచ్చ తెగుళ్లు ఎక్కువగా సోకి పంట దెబ్బతిందని,కొన్ని పొలాల్లో కాయలన్నీ కూడా కుళ్ళిపోయి నల్లబడ్డాయని,కోత దశలో ఉన్న తోట పంటలైన టమోట,మిరప,చామంతి మొదలగు పంటలలో శిలీంద్ర వ్యాధులు పాకి నష్టం వాటిల్లిందని తెలిపారు