వనపర్తి: వనపర్తిలో రైతుల ధర్నా: విద్యుత్ సమస్యపై నిరసన
వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామం పెద్దగూడెం రైతులు విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని ఆందోళన చేపట్టారు. 12 గంటల విద్యుత్ హామీ నెరవేర్చాలని కోరుతూ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. అధికారులు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.