హనుమకొండ: హన్మకొండలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం, ఉద్రిక్తత
హన్మకొండ అంబేడ్కర్ జంక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయగా, పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.