నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, సంగం మండలం, గాంధీజన సంఘం గ్రామంలో ఓ జిరాక్స్ షాపు యజమానిని బురిడి కొట్టించి రూ.35వేలు దోచేశాడు. బాధుతుడి వివరాల మేరకు.. ఓ వ్యక్తి షాపుకు వచ్చి ఫోన్ పే చేస్తా.. క్యాష్ ఇస్తారా అని అడిగారు. నేను సరే అంటూ ఫోన్ పే చేయించుకుని నగదు ఇచ్చానని తెలిపాడు. తాసిపెట్టి తర్వాత ఖాతాలో నగదు కనిపించలేదు. దీంతో మోసపోయాయని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అందుకు సంబంధించిన సీసీ కెమెరా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.