జనగాం: జనగామలో చైన్ స్నాచింగ్: మహిళ మెడలో 3 తులాల గొలుసు అపహరణ
జనగామ జయశంకర్ నగర్ కాలనీలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు కాసాని రజిత అనే మహిళ వద్ద నుంచి 3 తులాల బంగారు చైన్ లాక్కెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.