అదిలాబాద్ అర్బన్: మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా భీమవరం నుంచి ఢిల్లీకి సైకిల్ యాత్ర!
నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఏపీలోని భీమవరం నుంచి న్యూఢిల్లీ వరకు 3,000 కి.మీ సైకిల్ యాత్రను ఐ. విజయలక్ష్మి చేపట్టారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఈ యాత్రను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ఈ యాత్ర ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.