విశాఖపట్నం: గోపాలపట్నం రైతు బజార్లో రూ.35కే కిలో ఉల్లిపాయలు: ఎలా పొందాలంటే?
గోపాలపట్నం రైతు బజార్లో కిలో రూ.35కే సబ్సిడీ ఉల్లిపాయల విక్రయం ప్రారంభమైంది. వినియోగదారులు ఆధార్ కార్డు చూపించి ఈ ధరకే ఉల్లిపాయలు కొనుగోలు చేయవచ్చు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గణబాబు గారు ప్రారంభించారు.