ధర్మసాగర్: హన్మకొండలో కారు ప్రమాదం: తీవ్రంగా గాయపడిన వేలేరు ఎస్సై సురేష్
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం టేకులగూడెం ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఎస్సై సురేష్ ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి తిరిగి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఎస్సై తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రస్తుతం హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.