పుంగనూరు: 61 కేసుల పరిష్కారంలో ప్రతిభ చాటిన పోలీసులకు సన్మానం
పుంగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ లోక్ అదాలత్ ద్వారా 61 క్రిమినల్ కేసులను పరిష్కరించిన నలుగురు పోలీస్ సిబ్బందిని సీఐ సుబ్బరాయుడు, ఎస్సై అన్సర్ భాష అభినందించారు. మరిన్ని కేసులను ఇలాగే పరిష్కరించాలని పోలీసులను కోరారు.