నూతనకల్: చిల్పకుంటలో ఘనంగా చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంటలో సీపీఎం ఆధ్వర్యంలో వీరనారి చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతిని నిర్వహించారు. ఆమె పోరాట పటిమను, త్యాగాలను నాయకులు కొనియాడారు. సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు జరిగే సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.