అనకాపల్లి: పరవాడలో బైక్ దొంగల అరెస్ట్: 4 వాహనాలు స్వాధీనం
పరవాడలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 4 వాహనాలను స్వాధీనం చేసుకుని, రిమాండ్కు తరలించినట్లు సీఐ భాస్కరరావు తెలిపారు. ఒక నిందితుడిపై గతంలోనే పలు చోరీ కేసులు ఉన్నాయి.