కర్నూలు నుండి రాష్ట్ర రాజధాని అమరావతికి ప్రత్యేక రైళ్లు నడపాలని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బి. బతుకన్న, సిటీ అధ్యక్షుడు రేపల్లె ప్రతాప్‌లు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజును కోరారు.బుధవారం ఎంపీ బస్తిపాటి నాగరాజును కలిసి వారు వినతిపత్రం సమర్పించారు. రాజధాని దూరప్రాంతంలో ఉండటంతో బస్సు ప్రయాణం కష్టసాధ్యమవుతోందని, ముఖ్యంగా శ్రీశైలం ఘాట్ రోడ్డులో వర్షాకాలంలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయని తెలిపారు.ఈ నేపథ్యంలో కర్నూలు నుండి అమరావతికి ప్రతిరోజూ ఉదయం ఒక ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, రాత్రి 8 గంటలకు ఒక స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు నడపేలా పార్లమెంట్‌లో చర్