విజయవాడ అర్బన్: మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ
ఆదివారం సెలవు దినం కావడంతో మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు, నాగవల్లి వృక్షానికి ముడుపులు కట్టారు. ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాదరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.