నంద్యాల అర్బన్: నాగుల చవతి ఎఫెక్ట్, నంద్యాల బంగారు పుట్ట వద్ద భారీ క్యూ
Nandyal Urban, Nandyal | Aug 16, 2026
నంద్యాలలోని చెరువుకట్టపై ఉన్న బంగారుపుట్ట దగ్గర నాగుల చవితి సందర్భంగా నాగదేవతకు వివిధ ప్రాంతాల భక్తులు ఆదివారం పూజలు చేశారు. పెద్ద ఎత్తున తరలిరావడంతో భారీ క్యూ ఏర్పడింది. ప్రతిఏటా నాగుల పంచమి పండుగ సందర్భంగా ఆ నాగదేవతకు నూలపిండి, పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటే తాము కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. దీంతో చుట్టుపక్కల ప్రజలు ఇక్కడికి పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.