పలమనేరు: పోలింగ్ కేంద్రంలో మహిళా ఓటరుకు చేదు అనుభవం!
పలమనేరు మున్సిపాలిటీ 8వ వార్డులో ఆయేషా అనే మహిళ ఓటు వేయడానికి వెళ్లగా, ఆమె ఓటు అప్పటికే నమోదైనట్లు సిబ్బంది తెలిపారు. దీనితో తనకు జరిగిన అన్యాయంపై ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.